

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళ పక్షం అష్టమి ఉదయం 7:32 వరకు; అనంతరం నవమి తెల్లవారుజామున 5:13 వరకు, ఆపై దశమి. పునర్వసు రాత్రి 2:32 వరకు; అనంతరం పుష్యమి. వర్జ్యం: మధ్యాహ్నం 3:21 నుంచి 4:50 వరకు; దుర్ముహూర్తం: సాయంత్రం 4:11 నుంచి 4:58 వరకు; అమృత ఘడియలు: రాత్రి 12:18 నుంచి 1:47 వరకు; రాహుకాలం: సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. సూర్యోదయం: ఉదయం 5:54; సూర్యాస్తమయం: సాయంత్రం 5:46.
ఈరోజు (04-10-2026):
ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ చురుకుదనం మంచి ఫలితాలను అందిస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
ఈ వారం విజయ సూచనలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. ఉద్యోగంలో సూర్యబలం సహకరించడంతో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి మంచి గుర్తింపు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో చురుకుదనం అవసరం. సందేహాలను పక్కనపెట్టి లక్ష్యంపై దృష్టి పెట్టాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఒక పని పూర్తయ్యాక మరో పనిని ప్రారంభించడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఖర్చులను నియంత్రించాలి. వారం మధ్యలో శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పారాయణం శుభప్రదం.
ఈరోజు (04-10-2026):
మీ పట్టుదలకు తగిన ఫలితాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. శివనామస్మరణ మేలు చేస్తుంది.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగితే మంచి విజయాలు సాధిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. బుధబలం సరైన నిర్ణయాలకు సహకరిస్తుంది. మీ నైపుణ్యాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. కొత్త అవకాశాలను పరిశీలించండి. ఇప్పటికే అనుకూలంగా ఉన్న మార్గాన్ని తొందరగా మార్చవద్దు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు అవసరం. ఆరోగ్యం, విశ్రాంతిపై శ్రద్ధ పెట్టాలి. వారాంతంలో మంచి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. శివనామస్మరణ మేలు చేస్తుంది.
ఈరోజు (04-10-2026):
ప్రారంభించిన ప్రయత్నాలు విజయ దిశగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. శ్రీగణేశ అష్టోత్తరం పఠించడం శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
మనోబలం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే కార్యసిద్ధి లభిస్తుంది. గురుబలం సరైన దిశను ఎంచుకోవడానికి తోడ్పడుతుంది. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలతతో పాటు ధనయోగం ఉంటుంది. సంపాదనను జాగ్రత్తగా వినియోగించాలి. ముఖ్యమైన పనులను క్రమంగా పూర్తి చేస్తే సంతృప్తికర ఫలితాలు వస్తాయి. ఉద్యోగ బాధ్యతలను వాయిదా వేయకండి. అనవసర చర్చల్లో సమయాన్ని వృథా చేయవద్దు. వ్యాపారంలో ఆలోచించి ముందుకు సాగాలి. శ్రీగణేశ అష్టోత్తరం పఠించడం శుభప్రదం.
ఈరోజు (04-10-2026):
వృత్తిపరంగా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అనవసర సందేహాలను పక్కనపెట్టి పనిపై దృష్టి పెట్టాలి. శ్రీరామ నామస్మరణ శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభఫలితాలు కనిపిస్తాయి. అదృష్టం కొంతమేర సహకరిస్తుంది. సూర్య, బుధ బలాలు కార్యసాధనకు తోడ్పడతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తే మంచి పేరు వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ధైర్యంగా ముందుకు సాగవచ్చు. వ్యాపారంలో బుద్ధిబలాన్ని ఉపయోగించి మంచి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అనవసర సందేహాలను తగ్గించి పనిపై దృష్టి పెట్టాలి. శ్రీరామ నామస్మరణ శుభప్రదం.
ఈరోజు (04-10-2026):
మానసిక స్థైర్యం మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. శ్రీనరసింహ స్వామి ధ్యానం మేలు చేస్తుంది.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దృఢసంకల్పంతో పనులను ప్రారంభించండి. చిన్నపాటి విజయాలు కూడా ఉత్సాహాన్ని పెంచుతాయి. శుక్రబలం ఆర్థిక విషయాల్లో కొంత మేలు చేస్తుంది. అయితే అనవసర ఖర్చులను తగ్గించాలి. ఉద్యోగంలో సంయమనంతో వ్యవహరించి పనులకు ప్రాధాన్య క్రమం పాటించాలి. వ్యాపార నిర్ణయాల్లో లాభనష్టాలను పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. తొందరపాటు వల్ల ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించాలి. శ్రీనరసింహ స్వామివారి ధ్యానం మేలు చేస్తుంది.
ఈరోజు (04-10-2026):
శుభపరిణామాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. శ్రీలక్ష్మీ అష్టోత్తరం పఠించడం శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
ఈ వారం శుభకాలం కొనసాగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మనోబలంతో ముందుకు సాగితే మీ ఆలోచనలకు కార్యరూపం వస్తుంది. ఉద్యోగంలో ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు లభిస్తాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం వల్ల గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారంలో బుధబలం సరైన నిర్ణయాలకు సహకరిస్తుంది. కొత్త అవకాశాలను పరిశీలించి సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికాభివృద్ధికి అనుకూల మార్గాలు కనిపిస్తాయి. గురు, శుక్ర బలాలు మేలు చేస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే స్థిరమైన పురోగతి ఉంటుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తరం పఠించడం శుభప్రదం.
ఈరోజు (04-10-2026):
స్వయంకృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. ఆర్థిక విషయాల్లో మితవ్యయం పాటించడం మంచిది. లలితా సహస్రనామ పారాయణం శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. స్వయంకృషిపై నమ్మకం ఉంచి పనులను ప్రారంభించండి. శని అనుకూలత నిరంతర ప్రయత్నానికి తోడ్పడుతుంది. ప్రారంభించిన పనిని మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలి. ఇతరుల సహాయం కోసం ఎక్కువగా ఎదురుచూడకండి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుక్రబలం కొంత మేలు చేస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. వెంటనే గుర్తింపు రావాలని ఆశించకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టండి. వ్యాపార నిర్ణయాలు పూర్తి అవగాహనతో తీసుకోవాలి. లలితా సహస్రనామ పారాయణం శుభప్రదం.
ఈరోజు (04-10-2026):
వృత్తిపరమైన విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. గత అనుభవం ముఖ్యమైన నిర్ణయాల్లో ఉపయోగపడుతుంది. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులను తగ్గించాలి. శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మేలు చేస్తుంది.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
ఉద్యోగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. సూర్యబలం మీ పనితీరుకు గుర్తింపును అందిస్తుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. గురుబలం మంచి అవకాశాలను ఎంచుకోవడానికి సహకరిస్తుంది. గౌరవప్రదమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. గత అనుభవాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికంగా అనుకూలత ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించాలి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మేలు చేస్తుంది.
ఈరోజు (04-10-2026):
అవకాశాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. తొందరపాటు నిర్ణయాలను నివారించాలి. శ్రీమహాలక్ష్మి స్మరణ శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభఫలితాలు కనిపిస్తాయి. దశమస్థాన సూర్యబలం బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు సహకరిస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు ఎదురవుతాయి. బుధబలం సరైన నిర్ణయాలకు తోడ్పడుతుంది. ఆర్థికాభివృద్ధికి అనుకూలత ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు ముందు పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలను నివారించాలి. శ్రీమహాలక్ష్మి స్మరణ శుభప్రదం.
ఈరోజు (04-10-2026):
ఏకాగ్రతతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీవేంకటేశ్వర సుప్రభాతం పఠించడం మేలు చేస్తుంది.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
లక్ష్యసాధనకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి. మనోబలం మీ కృషికి తోడ్పడుతుంది. వ్యాపారంలో అవగాహనతో ముందుకు సాగుతారు. బుధబలం సమయోచిత నిర్ణయాలకు సహకరిస్తుంది. కొత్త ప్రయత్నాలకు ముందు లాభనష్టాలను పరిశీలించాలి. ఉద్యోగంలో మీ పనితీరుతో సామర్థ్యాన్ని నిరూపించుకోండి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. చేస్తున్న పని పూర్తయిన తర్వాతే కొత్త పనిని ప్రారంభించడం మంచిది. శ్రీవేంకటేశ్వర సుప్రభాతం పఠించడం మేలు చేస్తుంది.
ఈరోజు (04-10-2026):
ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంగా అధిగమిస్తారు. పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం మంచిది. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులను నియంత్రించాలి. కాలభైరవాష్టకం పఠించడం శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
మనోబలంతో ముందుకు సాగితే విజయావకాశాలు ఉంటాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కుజబలం ముఖ్యమైన బాధ్యతలను పూర్తి చేయడానికి సహకరిస్తుంది. సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఒక్కో పనిని క్రమంగా పూర్తి చేయాలి. శుక్రబలం ఆర్థికంగా కొంత మేలు చేస్తుంది. ఆదాయాన్ని మించి ఖర్చు చేయకండి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేయాలి. వ్యాపారంలో ప్రతి అడుగును ఆలోచించి వేయాలి. ఇతరుల మాటలతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కాలభైరవాష్టకం పఠించడం శుభప్రదం.
ఈరోజు (04-10-2026):
లక్ష్యసాధనకు దోహదపడే పరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. శ్రీకృష్ణ నామస్మరణ శుభప్రదం.
ఈవారం (04-10-2026 - 10-10-2026):
లక్ష్యం చేరువలో ఉంటుంది. సకాలంలో చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి. పెట్టుబడులు, సమష్టి నిర్ణయాలు మేలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుని, మీ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమాజంలో గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించాలి. ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. శ్రీకృష్ణ నామస్మరణ శుభప్రదం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!