

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పలుమార్లు వాయిదాపడిన ల్యూడ్మైలా (33), ఉక్రెయిన్ సైనికుడు లియోనిడ్ (43) వివాహం ఎట్టకేలకు కీవ్‌లో జరిగింది. పెళ్లికి ముందు రోజు రాత్రి ల్యూడ్మైలా తన ఎంబ్రాయిడరీ చేసిన పెళ్లిగౌనును ఇస్త్రీ చేసుకుని నిద్రకు ఉపక్రమించింది. అయితే అదే రాత్రి వారి అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న గిడ్డంగిపై రష్యా సేనలు దాడి చేయడంతో భవనం తీవ్రంగా దెబ్బతింది. శిథిలాల నుంచి పెళ్లి దుస్తులను బయటకు తీసుకోవాల్సి వచ్చింది.
అపార్ట్మెంట్ నివాసయోగ్యం కాకపోవడంతో దాన్ని ఖాళీ చేసిన వెంటనే మరోసారి దాడి జరిగింది. బయట సైరన్లు, బాంబుల మోతలు వినిపిస్తున్నప్పటికీ ఈసారి పెళ్లిని ఆపకూడదని ల్యూడ్మైలా, లియోనిడ్ నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం 10.40 గంటలకు కీవ్‌లోని రిజిస్ట్రీ కార్యాలయానికి చేరుకున్న ఈ జంట వివాహాన్ని అధికారి నమోదు చేశారు. “మేం ప్రాణాలతో బయటపడ్డాం కాబట్టి, కొత్త జీవితం మొదలైంది” అని ల్యూడ్మైలా సంతోషం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!