

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంధువులను వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించి సాగనంపేందుకు వచ్చిన 12 మంది అనుకోకుండా రైలు లోపలే చిక్కుకుపోయారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. వారు రైలు నుంచి దిగేలోపే ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో పాటు రైలు బయలుదేరిపోయింది. దీంతో తిరిగి ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని ఇత్వా స్టేషన్‌కు రైలు చేరుకున్న తర్వాత వారిని కిందకు దించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ప్లాట్‌ఫామ్ టికెట్లు లేకపోవడంతో రైల్వే అధికారులు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.36,000 జరిమానా విధించినట్లు సమాచారం. బంధువులను సాగనంపేందుకు స్టేషన్‌కు వచ్చి, చివరకు అనుకోకుండా రైలు ప్రయాణం చేయాల్సి రావడం ఈ ఘటనను చర్చనీయాంశంగా మార్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!