
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసిన హంటావైరస్ వ్యాప్తి అధికారికంగా ముగిసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. క్రూయిజ్ నౌకకు సంబంధించిన ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని ఆరోగ్య అధికారులు నిరంతరం పర్యవేక్షించారు.
చివరిగా వైరస్ బారినపడిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి 42 రోజుల పర్యవేక్షణను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు WHO వెల్లడించింది. పర్యవేక్షణ కాలంలో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో హంటావైరస్ వ్యాప్తి ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో దాదాపు రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!