
జనరల్

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తన కుమార్తె ఆంజిలి వివాహానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి చెన్నైలో డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. ఆంజిలి, రఘురాం రెడ్డి వివాహానికి హాజరు కావాలని కోరుతూ కనిమొళికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్‌ను కూడా షర్మిల దంపతులు కలిశారు. కుమార్తె ఆంజిలి, రఘురాం రెడ్డి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆమెకు కూడా ఆహ్వాన పత్రిక అందించారు. చెన్నై పర్యటనలో భాగంగా షర్మిల ప్రముఖ రాజకీయ నేతలను వ్యక్తిగతంగా కలిసి వివాహ ఆహ్వానాలు అందించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!