

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించబోయేది ఎవరనే అంశంపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గతంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పేరు తెరపైకి వచ్చింది. హరీష్ శంకర్, మారుతి కూడా చిరంజీవికి కథలు వినిపించినట్లు సమాచారం. అయితే, వీరిలో ఎవరికీ ఇంకా తుది ఆమోదం లభించలేదని తెలుస్తోంది. కథ నచ్చడంతో పాటు దర్శకుడి అంకితభావం, చిత్రీకరణపై ఆసక్తి వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే చిరంజీవి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిరంజీవి సినిమా కాకాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చిత్రీకరణ దాదాపు పూర్తికావడంతో నిర్మాణానంతర పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపైనా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి తదుపరి ప్రాజెక్టును ఎవరితో చేస్తారనే విషయం త్వరలో స్పష్టమయ్యే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!