

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాల అభిమానులను అలరించిన ‘ఎక్స్ ట్రాక్షన్’ సిరీస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు మూడో భాగం అధికారికంగా ఖరారైంది. ప్రధాన పాత్రలో క్రిస్ హేమ్స్‌వర్త్ మరోసారి కనిపించనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తొలి రెండు భాగాల్లో ఆకట్టుకున్న నటుడు ఐడ్రిస్ ఎల్బా, దర్శకుడు సామ్ హర్‌గ్రేవ్ కూడా ఈ ప్రాజెక్టులో కొనసాగనుండటం విశేషంగా మారింది. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ అభిమానుల దృష్టి మరోసారి ఈ సిరీస్‌పైనే నిలిచింది.
కోవిడ్ సమయంలో విడుదలైన తొలి చిత్రం అంచనాలకు మించి ఆదరణ పొందగా, రెండో భాగం కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మూడో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. క్రిస్ హేమ్స్‌వర్త్, ఐడ్రిస్ ఎల్బా, సామ్ హర్‌గ్రేవ్ కలిసి ఉన్న చిత్రాన్ని విడుదల చేస్తూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటించింది. గత చిత్రాల కంటే మరింత ఉత్కంఠభరితమైన కథ, భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక చిత్రీకరణతో ప్రేక్షకులను అలరించేలా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే విడుదల తేదీపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!