

హీరో ఆది సాయికుమార్ మరో ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.3గా ఈ సినిమా తెరకెక్కనుంది. చిత్రాన్ని ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో త్రిశూలం చుట్టూ చుట్టుకున్న భారీ నాగుపాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దట్టమైన అడవిలోని పురాతన ఆచార ప్రదేశాన్ని తలపించేలా రూపొందించిన ఈ పోస్టర్లో పెద్దపెద్ద ఆయుధాలు, వెలుగుతున్న దీపాలు, వేలాడుతున్న గంటలు కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
దైవిక శక్తులు, విశ్వాసం, అంతుచిక్కని రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, విడుదల తేదీ వివరాలను ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ 20, 2026న సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆ పోస్టర్‌తో కథా నేపథ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!