

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డు ద్విశతకంతో అదరగొట్టాడు. వన్డే ఫార్మాట్‌లోనూ టీ20 తరహా దూకుడుతో బ్యాటింగ్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అతడి ఆటతీరుపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించారు. వైభవ్‌ను అన్ని ఫార్మాట్లలో ఆడించాలని సెలక్టర్లకు సూచించారు. వెంటనే టెస్టుల్లో ఆడించకపోయినా కనీసం జట్టులో చోటు కల్పించాలని అన్నారు. త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌లోనైనా అతడికి అవకాశం ఇవ్వాలని సూచించారు. ఒక్క మ్యాచ్‌లో ఆడించినా అతడి ప్రతిభను అంచనా వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం ప్రకటించే 15 మంది సభ్యుల జట్టులోనూ వైభవ్‌కు చోటు కల్పించాలని శ్రీకాంత్ సూచించారు. అతడి బ్యాటింగ్‌లో పవర్‌తో పాటు అద్భుతమైన టైమింగ్ ఉందని, ఎంతో ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడతాడని ప్రశంసించారు. క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ తర్వాత వైభవ్ ‘సన్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ క్రికెట్’ అని అభివర్ణించారు. ఇలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని ప్రోత్సహించాల్సిన బాధ్యత జట్టు యాజమాన్యం, సెలక్టర్లపై ఉందన్నారు. అతడే ఎదుగుతాడని వదిలేయకుండా సరైన అవకాశాలు కల్పించాలని, ఒక నాణ్యమైన క్రికెటర్ భవిష్యత్తును నిర్లక్ష్యంతో దెబ్బతీయొద్దని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!