

దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న నటి అదితి రావు హైదరీ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అక్టోబర్ 23న తన 40వ పుట్టినరోజు జరుపుకోనున్న ఆమె.. విజయాలు, అపజయాలు రెండింటినీ జీవితంలో భాగంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రతి అనుభవం తనకు కొత్త పాఠాలను నేర్పిందని, ప్రస్తుతం తన ఆలోచనల్లో స్పష్టత, జీవితంపై కృతజ్ఞతా భావం పెరిగాయని పేర్కొన్నారు.
చిన్ననాటి తనను ఇప్పుడు కలిస్తే, ఎలాంటి అనవసర ఒత్తిడికి లోనుకాకుండా సంతోషంగా తనలా తాను ఉండాలని సలహా ఇస్తానని అదితి చెప్పారు. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా, మనల్ని నిజంగా ప్రోత్సహించే వ్యక్తులను నమ్మాలని సూచించారు. తప్పులు చేయడానికి భయపడకూడదని, వాటి నుంచే విలువైన పాఠాలు నేర్చుకుని ఎదగవచ్చని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎదుగుదల ఎప్పుడూ సులభంగా ఉండదని, ఎదురయ్యే ప్రతి సవాలు అనుభవాన్ని పెంచుతుందని అన్నారు. భవిష్యత్తులో ఎవరితో కలిసి పనిచేయాలి, ఎలాంటి పాత్రలను ఎంచుకోవాలి అనే విషయంలో తనకు స్పష్టత ఉందని పేర్కొంటూ, ఇతరుల అన్యాయమైన ప్రవర్తనను వారి కర్మకే వదిలేయాలని అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!