

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల రాజ్ షమాని పాడ్‌కాస్ట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ పాత్రలు, నటీమణులు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాల గురించి ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా తెరపై సన్నిహిత సన్నివేశాల విషయంలో తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని జాన్వీ చెప్పినట్లు వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. గ్లామరస్ దుస్తులు, బోల్డ్ ఫొటోషూట్లు, ఫ్యాషన్ అప్పియరెన్స్‌తో తరచూ వార్తల్లో నిలిచే జాన్వీ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో నటి తారా సుతారియాతోనూ జాన్వీని పోలుస్తున్నారు. గ్లామర్, బోల్డ్‌నెస్ విషయంలో ఇద్దరు నటీమణులు అనుసరించే విభిన్న శైలులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు వీర్ పహారియాతో జాన్వీకి ఉన్న అనుబంధం కూడా ఆమెను తరచూ వార్తల్లో నిలుపుతోంది. బోల్డ్ ఫ్యాషన్, గ్లామరస్ ఫొటోషూట్లకు అంగీకారం ఉన్నప్పుడు సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ విషయంలో ఎందుకు భిన్నమైన చర్చ జరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే, తెరపై తాము ఏ విధమైన పాత్రలు, సన్నివేశాలు చేయాలనుకుంటున్నామో నిర్ణయించుకునే హక్కు ప్రతి నటికీ ఉంటుందని, వారి వ్యక్తిగత హద్దులను గౌరవించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!