

హైదరాబాద్ గల్లీలు, బస్తీల్లోని స్థానిక జీవనశైలిని తెరపై ఆవిష్కరించేందుకు తెరకెక్కుతున్న చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్నారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం తాజాగా ‘బజారే బ్యాన్జో’ అనే హిందీ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ యువత, గల్లీలు, బస్తీల సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాటకు డబుల్ ఈ (వసీం) సాహిత్యం అందించడంతో పాటు గానం చేశారు. షబాజ్ ఖాన్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, స్మరణ్ సాయి అందించిన సంగీతం క్యాచీగా ఉంది. హైదరాబాద్ యూత్‌కు ఈ పాట ఓ ఆంథమ్‌లా నిలిచేలా ఉందని చిత్రబృందం భావిస్తోంది. పక్కా లోకల్ ఫ్లేవర్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్వీకే కెమెరావర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!