

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత రెండు వారాలుగా ఇటలీలో హాలిడే ఎంజాయ్ చేసి, ఈ వీకెండ్‌లో హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఆయన రాకతో ‘ఫౌజీ’ సినిమా కొత్త షెడ్యూల్ సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం భారీ పెళ్లి సెట్‌ను రూపొందించింది. ఇందులో ప్రభాస్, కథానాయిక ఇమాన్విపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి ‘ఫౌజీ’లో తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేయాలని ప్రభాస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో ఇదొకటిగా నిలవనుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన ప్రకారం, ‘ఫౌజీ’ 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!