
జనరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై నిర్మాత బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో గుజరాత్‌లో జరిగిన ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఘటన, ఆ సమయంలో డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించిన విషయాలను ఆయన గుర్తుచేశారు. అయితే షూటింగ్ పూర్తి చేయాలనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ తన నొప్పిని భరించి, ఆపరేషన్‌ను వాయిదా వేసిన విధానం ఇప్పటికీ తన మనసులో నిలిచిపోయిందని తెలిపారు.
ఆ సమయంలో పవన్ చూపిన బాధ్యత, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదన్న తపనను బండ్ల గణేష్ గుర్తుచేసుకుంటూ భావోద్వేగంగా స్పందించారు. ఆయన నిజ జీవితంలో కూడా హీరో అని, ఆయన ఆరోగ్యం, ఆనందం ఎప్పటికీ నిలవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉండటమే తమకు పెద్ద సంతోషమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!