

కల్ట్ నిర్మాత ఎస్‌కేఎన్ తన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. టాక్సీవాలా, బేబీ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఎంతో శ్రద్ధగా రూపొందించామని తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తుండగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కిరణ్ అబ్బవరం నటనలో కొత్త మెచ్యూరిటీని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూస్తారని, శ్రీ గౌరి ప్రియ పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని ఎస్‌కేఎన్ తెలిపారు. తొలి ప్రేమతో పాటు మలి ప్రేమ కూడా జీవితంలో ఎంతో విలువైనదనే సందేశంతో ఈ కథ సాగుతుందని చెప్పారు. మణిశర్మ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, చెన్నై, పుదుచ్చేరి, విశాఖపట్నం, చీరాల వంటి సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని వెల్లడించారు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు తమ బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపును ఈ చిత్రం తీసుకొస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!