

ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తన పేరుతో కొనసాగుతున్న ఓ నకిలీ ఎక్స్ ఖాతాపై అభిమానులను అప్రమత్తం చేశారు. @_dulQuer పేరుతో ఉన్న ఆ ఖాతా తన అధికారిక ఖాతా కాదని స్పష్టం చేస్తూ, అందులోని పోస్టులను తన వ్యాఖ్యలుగా భావించవద్దని కోరారు. ఆ ఖాతా తనను అనుకరిస్తూ సినిమాలు, తోటి నటీనటుల గురించి వ్యాఖ్యలు చేస్తోందని, చివరికి తన కుటుంబ సభ్యులకు కూడా తన పేరుతో నకిలీ శుభాకాంక్షలు చెబుతోందని దుల్కర్ తెలిపారు. దీనివల్ల అనవసరమైన గందరగోళం, ప్రతికూలత ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ఖాతాను నివేదించి, ఎక్స్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశానని, అయితే ఇంకా స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
సినిమాల విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ ఇటీవల ‘ఐ యామ్ గేమ్’ చిత్రంలో కనిపించారు. ఆయన తదుపరి పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తుండగా, నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!