

అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపై సమావేశం కానున్నారు. చైనాలోని షెన్‌జెన్‌లో నవంబర్ 18, 19 తేదీల్లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ (ఏపీఈసీ) సదస్సు సందర్భంగా నవంబర్ 19న ఈ త్రైపాక్షిక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ప్రణాళికలను వైట్‌హౌస్ ధృవీకరించింది. ప్రపంచంలోని మూడు ప్రధాన శక్తులకు చెందిన దేశాధినేతలు ఒకేసారి చర్చలు జరపనుండటంతో ఈ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
అణ్వాయుధాల నియంత్రణ, ఇరాన్‌కు సంబంధించిన అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఈ త్రైపాక్షిక సమావేశం ఎజెండాలో లేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ భేటీతో వెంటనే కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రాథమిక చర్చలకు ఇది వేదికగా నిలవనుందని తెలుస్తోంది. ముఖ్యంగా అణ్వాయుధ నియంత్రణపై భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిపేందుకు ఈ సమావేశం మార్గం సుగమం చేయవచ్చని భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!