
జనరల్

ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఈ నెల 12న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలను ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించి, ఈ విషయంపై కఠినంగా వ్యవహరిస్తోంది.
14న విచారణకు హాజరు కావాలని పిలిచినా జానీ మాస్టర్ రాకపోవడం ఫెడరేషన్ ఆగ్రహానికి దారితీసింది. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. డ్యాన్సర్ల అసోసియేషన్ తీరుపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. సుమలత తీరుపై కూడా అభ్యంతరం తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!