

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ముందుంటుంది. భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ అన్ని రకాల కథలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇతర భాషల్లో ప్రతిభ చూపిన దర్శకులకు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి తమ సంస్థతో సినిమాలు చేసేలా ఒప్పించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్ వంటి దర్శకులతో ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. తాజాగా సీన్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్‌కు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం, సిబి చక్రవర్తి, ఆర్ రవికుమార్, విశాల్ వెంకట్, అధిక్ రవిచంద్రన్ పేర్లు కూడా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రదీప్ రంగనాథన్, నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్‌లను కూడా సంస్థ ముందుగానే సంప్రదించినట్లు సమాచారం. ఇలా ప్రతిభ ఉన్న దర్శకులను గుర్తించి అవకాశాలు కల్పించడంలో మైత్రీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అయితే వీరందరితో సినిమాలు ఎప్పుడు ప్రారంభిస్తారనేది చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!