
టెక్నాలజీ

వెండితెరపై విలన్గా, గంభీరమైన పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే జగపతిబాబు నిజ జీవితంలో మాత్రం ఎంతో సరదాగా, నిరాడంబరంగా ఉంటారు. స్టార్ హోదాను పక్కనపెట్టి సామాన్యులతో సులభంగా కలిసిపోయే ఆయన, తాజాగా చేసిన ఓ పని అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. వర్కర్లతో కలిసి భోజనం చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వర్కర్ల కోసం ప్రత్యేకంగా భోజనం తెప్పించిన జగపతిబాబు, వారితో కలిసి అదే భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో సరదాగా గడిపిన క్షణాలను వీడియో రూపంలో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ అందరితో కలిసిమెలిసి ఉండే ఆయన స్వభావాన్ని చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!