

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయికల్లో మమిత బైజు ఒకరు. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు చేరువవుతున్న ఈమె, వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు. ‘జన నాయగన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ వంటి చిత్రాలతో మమిత పేరు వినిపిస్తోంది. తెలుగు సినిమాల్లోనూ ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన పెళ్లికి సంబంధించిన సోషల్ మీడియా పుకార్లతో మమిత మరోసారి వార్తల్లో నిలిచారు.
మమిత బైజు జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలను, ముఖ్యంగా ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని సోదరుడు మిథున్ బైజు నిర్ణయిస్తారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక పోస్టుకు మమిత సరదాగా ‘వాట్?’ అనే స్టికర్‌తో స్పందించినట్లు సమాచారం. దీంతో ఆమె రిప్లై నెట్టింట చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, విష్ణు విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఇరండు వానం’తో పాటు, భారీ అంచనాలతో రూపొందుతున్న ‘జై హనుమాన్’లోనూ ఆమె నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్టుల్లో ఆమె పాత్రలపై అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!