

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మెగా 158’. చిరంజీవి కెరీర్‌లో ఇది 158వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే రోజు టైటిల్ టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
ఈ సినిమాలో అనస్వర రంజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. థమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. షూటింగ్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రిలీజ్ డేట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఆగస్టు 22న టైటిల్‌తో పాటు విడుదల తేదీని ప్రకటిస్తారనే వార్తలపై మేకర్స్ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. చిరంజీవి పుట్టినరోజున అభిమానులకు ఒకేసారి రెండు కీలక అప్డేట్లు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ మెగా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!