

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రి మూవీ మేకర్స్‌కు ఈ ఏడాది సినిమాల పరంగా మరోసారి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ సంస్థ నిర్మించిన మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుని రూ.100 కోట్లకు పైగా లాభాలు సాధించినట్లు సమాచారం. ఇటీవల ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మరో కోలీవుడ్ చిత్రం ‘మొద రాత్రి’ కూడా ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ రెండు చిత్రాలు ఒకే నెట్‌ఫ్లిక్స్ వేదికపై అందుబాటులోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’, ‘మొద రాత్రి’ చిత్రాలు ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం. భారత్ వ్యాప్తంగా ‘ఇరుముడి’ నంబర్ వన్ స్థానంలో, ‘మొద రాత్రి’ టాప్-2లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకే నిర్మాణ సంస్థకు చెందిన రెండు చిత్రాలు ఓటీటీ ట్రెండింగ్‌లో అగ్రస్థానాల్లో నిలవడం విశేషంగా మారింది. థియేటర్ల తర్వాత డిజిటల్ వేదికపైనా ప్రేక్షకుల ఆదరణ దక్కడం మైత్రి మూవీ మేకర్స్‌కు మరో సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. ‘ఇరుముడి’కి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ‘మొద రాత్రి’ని రాజా కరుప్పుసామి తెరకెక్కించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!