
సినిమాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ 'ఫౌజీ' చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. హను రాఘవపూడి-ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!