
క్రీడలు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం ‘రణబాలి’ని సెప్టెంబర్‌లో, ‘రౌడీ జనార్ధన్’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ‘రణబాలి’ సెప్టెంబర్ రేస్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దసరా సీజన్ ఇప్పటికే భారీ సినిమాలతో నిండిపోవడంతో ‘రణబాలి’ని నవంబర్ లేదా డిసెంబర్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే రెండు విజయ్ దేవరకొండ సినిమాల మధ్య గ్యాప్ కోసం ‘రౌడీ జనార్ధన్’ విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!