

హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కల్ట్ నిర్మాత ఎస్‌కేఎన్ తన పుట్టినరోజును ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రబృందం సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, దర్శకుడు రవి నంబూరి తదితరులు పాల్గొని ఎస్‌కేఎన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నుంచి మరిన్ని విజయవంతమైన చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టి ఎస్‌కేఎన్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తామని అన్నారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ జర్నలిస్టుగా ప్రారంభమైన తన ప్రయాణంలో మీడియా మిత్రుల సహకారం ఎంతో కీలకమైందని గుర్తు చేసుకున్నారు. ‘బేబీ’ తర్వాత ‘చెన్నై లవ్ స్టోరీ’ మరో క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!