
జనరల్

మహేంద్రగిరి వారాహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నటుడు సుమంత్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ భార్య కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని, ఆమె కుటుంబ సభ్యులతో కూడా మంచి అనుబంధం ఉందని తెలిపారు. అప్పట్లో ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేకపోవడం వల్లే వివాహ బంధం నిలవలేదని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఒంటరి జీవితంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, మళ్లీ వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని సుమంత్ స్పష్టం చేశారు. జీవితంలో తోడు అనేది తప్పనిసరిగా జీవిత భాగస్వామి ద్వారానే రావాల్సిన అవసరం లేదని, పెంపుడు జంతువులు లేదా ఆప్తుల ద్వారా కూడా ఆనందం పొందవచ్చని అన్నారు. భవిష్యత్తులో అవసరం అనిపిస్తే అప్పుడే ఆ విషయంపై ఆలోచిస్తానని, ప్రస్తుతం తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!