
జనరల్

కల్ట్ బ్లాక్‌బస్టర్ 'బేబీ' విడుదలై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ఆ విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసింది. ప్రేమ, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం ఇప్పటికీ సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుని, గుర్తుండిపోయే ప్రేమకథగా నిలిచింది.

ఈ ప్రత్యేక సందర్భంగా తమ కొత్త చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'పై కూడా మేకర్స్ దృష్టి సారించారు. మరో భావోద్వేగభరితమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 'బేబీ' విజయానంతరం వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!