

టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నుంచి అనగనగా ఒక రాజు వరకు 4 సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయినప్పటికీ ఇప్పటివరకు స్టార్ దర్శకులతో ఆయన సినిమా చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేస్తూ తన మార్కెట్‌ను పెంచుకున్నారు. కామెడీతో పాటు భావోద్వేగ పాత్రల్లోనూ తన సత్తా నిరూపించారు.
అనగనగా ఒక రాజు రూ.100 కోట్ల వసూళ్ల మార్కును అందుకున్నది. అనిల్ రావిపూడి, వెంకీ అట్లూరి, తరుణ్ భాస్కర్ వంటి దర్శకులతో నవీన్ సినిమా చేస్తే మంచి వినోదం అందుతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా ఖరారైంది. దర్శకుడి పేరు ప్రకటించాల్సి ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్‌పై కూడా ప్రచారం సాగుతోంది. కొత్త ప్రాజెక్టుల చిత్రీకరణ 2027లో మొదలయ్యే అవకాశముంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!