

నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో సినీ ప్రముఖుల రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. ధనుష్, శివకార్తికేయన్ కూడా రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ, నటి నయనతార రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నయనతార 2031లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది.
దీనిపై విఘ్నేశ్ శివన్ స్పందిస్తూ, ప్రస్తుతం నయనతార మాతృత్వాన్ని ఆస్వాదిస్తోందని, తమ దృష్టంతా పిల్లలపైనే ఉందని తెలిపారు. కుటుంబం, కెరీర్‌కు సమయం కేటాయించడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని చెప్పారు. అనంతరం వృద్ధ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులను చూసినప్పుడు బాధ కలుగుతుందని పేర్కొంటూ, తల్లిదండ్రులు ఎంతో గౌరవానికి అర్హులని, వారిని చూసుకోవడం పిల్లల బాధ్యతని అన్నారు. అయితే, నయనతార రాజకీయాల్లోకి వస్తారనే విషయంపై ఆయన ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!