

ఓటీటీ వేదికలపైకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్నాయి. అలాంటి చిత్రాల్లో ‘సుమో దీదీ’ ఒకటి. భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్‌గా గుర్తింపు పొందిన హేతల్ డేవ్ జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఈ స్పోర్ట్స్ బయోపిక్‌ను తెరకెక్కించారు. సమాజం నుంచి విమర్శలు, కుటుంబపరమైన ఒత్తిళ్లు, వ్యక్తిగత సవాళ్లు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలను ఇందులో చూపించనున్నారు. శ్రియం భగ్నాని ప్రధాన పాత్రలో నటించగా, జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు ఓటీటీ విడుదల తేదీని కూడా ప్రకటించారు.
జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎంత ముఖ్యమో ఈ చిత్రం తెలియజేయనుంది. ఇతరులు బలహీనతగా భావించిన విషయాన్నే బలంగా మార్చుకుని, విమర్శలను ఎదుర్కొంటూ తమ కలలను సాకారం చేసుకోవచ్చనే సందేశాన్ని అందించనుంది. ‘సుమో దీదీ’ అక్టోబర్ 23 నుంచి జీ5 ఓటీటీలో హిందీ భాషలో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్లో కథకు సంబంధించిన పలు అంశాలను చూపించారు. విడుదలైన తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!