

ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన డివోషనల్ ఎమోషనల్ డ్రామా ‘కన్నమ్మ’ ఓటీటీలోకి వచ్చేసింది. పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నవంబర్ 29, 2026 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కథా సుధ సిరీస్‌లో భాగంగా విడుదలైన ఈ సినిమా భక్తి, మానవ సంబంధాలు, భావోద్వేగాల మేళవింపుతో రూపొందింది. సాధారణ జీవితంలోని సంఘటనలు, నమ్మకం, ఆధ్యాత్మికత చుట్టూ అల్లుకున్న కథ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
దివ్య భావన స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. పాయల్ రాధాకృష్ణతో పాటు చైతన్య పిన్నమనేని, మైథిలి కట్ట, మాస్టర్ వెంకట్ శౌర్య, లాస్యప్రియ, బేబీ శిఖరం, గీతిక మాధురి, రాకేష్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. జై మిహిర ధ్రువ మూవీస్ బ్యానర్‌పై గోలి శైలజ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించగా, వి. విజయేంద్ర ప్రసాద్, ఎ. మహాదేవ సోమయాజి సమర్పించారు. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించగా, విష్ణు బేసి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో, భక్తి, భావోద్వేగాలతో కూడిన కథలను ఇష్టపడేవారికి ‘కన్నమ్మ’ ఆసక్తికరమైన ఓటీటీ ఎంపికగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!