
సినిమాలు

తమిళనాడు ప్రభుత్వం, టీవీకే మంత్రులపై బీజేపీ నేత అన్నామలై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు కమీషన్ల కోసం పాకులాడుతున్నారని, ప్రతి టెండర్‌లోనూ పర్సంటేజ్ అడుగుతున్నారని ఆరోపించారు. మంత్రుల అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
కొంతమంది మంత్రులకు సంబంధించిన ఆడియో క్లిప్‌లు కూడా తన వద్ద ఉన్నాయని అన్నామలై తెలిపారు. సీఎం విజయ్ తన మంత్రులను కట్టడి చేయాలని, లేనిపక్షంలో ఆడియో క్లిప్‌లను బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. అయితే, అన్నామలై చేసిన ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత మంత్రుల నుంచి స్పందన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!