
జనరల్

నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల బరిలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బనగానపల్లె పంచాయతీని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే తన లక్ష్యమని ఇందిరారెడ్డి తెలిపారు. ఆమెకు కూటమి నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు స్థానిక TDP, జనసేన, BJP నాయకులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!