
జనరల్

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–SIR) ప్రక్రియకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను అక్టోబర్ 15న విచారణకు స్వీకరించాలని, ఇదే అంశానికి సంబంధించిన ఇతర పిటిషన్లతో కలిపి విచారించాలని ఆయన తరఫు న్యాయవాది నిజాముద్దీన్ పాషా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను కోరారు.
ఒవైసీ పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు సూచించింది. ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన అంశంపై ఇప్పటికే పలు పిటిషన్లు న్యాయస్థానం ముందుకు వచ్చిన నేపథ్యంలో, వాటితో కలిపి ఈ పిటిషన్ను కూడా విచారించే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణలో భాగంగా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!