
జనరల్

డీలిమిటేషన్ బిల్లులో తమ పార్టీ ముందుకు తెచ్చిన రెండు డిమాండ్లను చేర్చడంపై డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని డీఎంకే విజయంగా అభివర్ణించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై తమ పార్టీ మొదటి నుంచి ఆందోళనలు వ్యక్తం చేస్తోందని, ఇప్పుడు తమ ప్రధాన డిమాండ్లకు బిల్లులో చోటు లభించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై డీఎంకే భావోద్వేగాలకు లోనుకాకుండా, దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించిందని స్టాలిన్ తెలిపారు. డీలిమిటేషన్ వల్ల కలిగే పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించి, స్పష్టమైన లక్ష్యంతో తమ డిమాండ్లను ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియ, దాని వల్ల రాష్ట్రాలపై పడే ప్రభావంపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!