

రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాసత్ భూముల వ్యవహారంలో కొందరు అధికారులు లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తికి సంబంధించిన పనిని చేయాలని తాను ఓ అధికారిని కోరినా, సదరు అధికారి పట్టించుకోలేదని తెలిపారు. అయితే, అదే వ్యక్తి రూ. 15 వేలు లంచం ఇవ్వగానే ఆ పని పూర్తిచేశారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన తెలియజేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారులు లంచాలు తీసుకోవడం వల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి డిమాండ్ల కారణంగా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు వెనుకాడుతూ, ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!