

చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న ఏపెక్ (APEC) సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక త్రైపాక్షిక సమావేశానికి సిద్ధమయ్యారు. ప్రపంచ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీలో అంతర్జాతీయ భద్రత, ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల పరిణామాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం ద్వారా ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని ట్రంప్ భావిస్తున్నారు.
అణ్వాయుధ నియంత్రణకు సంబంధించి కొత్త ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభించడం కూడా ఈ సమావేశంలోని కీలక అంశంగా ఉండనుంది. అమెరికా, రష్యా అణ్వాయుధాలపై పరిమితులు విధించే గత ఒప్పందం ముగిసిన నేపథ్యంలో, చైనాను కూడా భాగస్వామిగా చేసుకుని కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే ఈ భేటీలోనే కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!