

ఆపదలో ఉన్న పొరుగు రాష్ట్రానికి అండగా నిలవడమే నిజమైన స్నేహమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. వరుస తుపాన్లతో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కర్ణాటక అందించిన సహకారం కేవలం సాయం మాత్రమే కాదని.. బాధిత ప్రజల కోసం కలిసి నిలబడిన మానవీయ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వానికి, సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు తెలపడంపై డీకే శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు.
అర్నబ్, మురసు తుపాన్ల తర్వాత ఏపీలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కర్ణాటక సిబ్బందిని పంపడం సంతోషాన్నిచ్చిందని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలు కష్టాల్లో ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సమయంలో ఎప్పుడైనా అండగా ఉంటామని స్పష్టం చేశారు. తుపాన్ల సమయంలో కర్ణాటక ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు డీకే శివకుమార్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!