

ఢిల్లీలో నేడు సాయంత్రం 4:30 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన ప్రధాన అంశాలు, పార్టీ సభ్యులు అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రస్తావించాల్సిన అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. అదే సమయంలో ఇతర విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఉభయ సభల్లో ఐక్యంగా వ్యవహరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. విపక్షాలన్నీ కలిసి పనిచేసేలా అనుసరించాల్సిన వ్యూహం, పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించే అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!