
సినిమాలు

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ నుంచి తన పేరును తొలగించాలని ఆయన పిటిషన్‌లో కోరినట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై నవంబర్‌లో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
మరోవైపు, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను A1 నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. తాజాగా ఆయన దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కోర్టు తీసుకునే నిర్ణయం తదుపరి న్యాయపరమైన పరిణామాల్లో కీలకం కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!