

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన అభ్యర్థిత్వంపై వస్తున్న ప్రచారాలకు తెరదిస్తూ, తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలో దిగడం ధర్మం కాదని అన్నారు. టీవీకే విజయం కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలకే ఆ అవకాశం దక్కాలని అభిప్రాయపడ్డారు. అయితే తాను తిరుచ్చి ఈస్ట్ నుంచే తప్పుకుంటున్నానని, భవిష్యత్తులో ఇతర నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాఘవ లారెన్స్ వెల్లడించారు. అయితే ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, గౌరవం లభించే పార్టీలోనే చేరుతానని చెప్పారు. ఇదిలా ఉండగా, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన తర్వాత తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆయన స్వయంగా దానిని ఖండించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!