

మునుగోడు నియోజకవర్గానికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగితే అనుచితంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మునుగోడుకు నిధులు విడుదల చేయకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని, అవసరమైతే కురుక్షేత్ర యుద్ధమే చేస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానాలు చెప్పాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తాను పదవుల కోసం పాకులాడటం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించడం, మునుగోడు అభివృద్ధికి నిధులు సాధించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!