

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం రాజకీయ వివాదానికి దారితీసింది. ఇందులో హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు సంజయ్ నిరుపమ్, షైనా ఎన్సీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుస్తక ప్రతుల నుంచి పేజీలను చించివేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ఈ పుస్తక విక్రయాలు, పంపిణీని మహారాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని శివసేన నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పుస్తకంలోని అంశాలు రాష్ట్రంలో వివాదానికి కారణమవుతున్నాయని పేర్కొంటూ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో సోనియా గాంధీ పుస్తకం, అందులో సావర్కర్ ప్రస్తావన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!