

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధర్మపురం ఉపఎన్నిక టీవీకే అభ్యర్థి పి. సత్యభామపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. ధర్మపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సత్యభామను ‘సూట్‌కేస్ భామ’, ‘సోమర్‌సాల్ట్ భామ’ అంటూ స్టాలిన్ విమర్శించారు. ఆమె భౌతిక రూపాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీవీకే నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని శరీరాకృతిపై అవమానకర వ్యాఖ్యలుగా అభివర్ణించారు.
టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని, అన్నాడీఎంకేను చీల్చేందుకు ప్రయత్నిస్తోందని కూడా స్టాలిన్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను టీవీకే నేతలు ఖండించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న ఆరోపణలను టీవీకే తోసిపుచ్చింది. ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరం స్వచ్ఛందంగా టీవీకేలో చేరారని ఆ పార్టీ పేర్కొంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!