

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరో పది మంది దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు రానున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్నట్లు ఆరోపిస్తున్న నిర్ణయాలను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఈ పిటిషన్ల విచారణ రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్నికల సంఘంలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల సంఘం నిర్ణయాల చట్టబద్ధత వంటి అంశాలు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. పిటిషనర్ల వాదనలు, వాటిపై సుప్రీంకోర్టు స్పందనపై ఆసక్తి నెలకొంది. విచారణ అనంతరం కోర్టు తీసుకునే నిర్ణయాలు తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!