
సినిమాలు

కడప జిల్లా పులివెందుల, కన్నంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామునే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఎంపీకి నోటీసులు అందజేసేందుకు సీఐ పురుషోత్తంరాజు అక్కడికి వచ్చారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, బయటకు రావద్దని సూచిస్తూ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఎంపీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు తమను బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఎంపీ అవినాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌ను అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చారా? అంటూ ఎంపీ సీఐ పురుషోత్తంరాజును ప్రశ్నించారు. పోలీసుల చర్యలు, నోటీసుల వ్యవహారంతో పులివెందుల, కన్నంపల్లి ప్రాంతాల్లో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!