

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల పంపకాలపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెడ్పీ చైర్మన్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేడు లేదా రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి నేతలు స్థానాల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం టీడీపీకి అత్యధిక స్థానాలు, జనసేనకు కొన్ని స్థానాలు కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీకి కూడా ఒక జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఐదు స్థానాలు కేటాయించాలని జనసేన పట్టుబడుతున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ, పశ్చిమగోదావరి, అనకాపల్లి, సత్యసాయి జిల్లాల్లో పదవుల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయి. కడప జెడ్పీ చైర్మన్ స్థానంపై టీడీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. కూటమి నేతల తుది నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!