
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వీఎస్ బాబు, అప్పటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విజయం సాధించి వార్తల్లో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో డీఎంకేలో పనిచేసిన వీఎస్ బాబు, ఆ తర్వాత టీవీకేలో చేరి కీలక నేతగా ఎదిగారు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆయన మరణించినట్లు సమాచారం. ఆయన మరణవార్తతో టీవీకే శ్రేణులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!