

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీని సిద్ధం చేసే దిశగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కోఆర్డినేటర్లతో సమావేశమై పార్టీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. బలమైన, విశ్వసనీయ అభ్యర్థులను గుర్తించి, పార్టీ నేతలు, కేడర్‌తో విస్తృతంగా చర్చించిన తర్వాత అభ్యర్థుల జాబితాలను ఖరారు చేయాలని ఆయన సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలకు దిశానిర్దేశం చేయడం వంటి అంశాలపై జగన్ దృష్టి సారించారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలతో చర్చల ద్వారా ఎన్నికల కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!